బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (12:33 IST)

చర్చిలో తొక్కిసలాట: 29 మంది మృతి.. కొందరి పరిస్థితి విషమం

లిబీరియాలోని ఓ చర్చిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మొనోర్వియా శివారులోని న్యూక్యూటౌన్‌లో పెంతెకొస్తల్ చర్చి వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించారు. దీంతో అక్కడున వారు భయంతో పరుగులు తీశారు. 
 
ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.