సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (11:09 IST)

మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో ఘోర విషాదం: తొక్కిసలాటలో 12 మంది దుర్మరణం

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం 2022 సందర్భంగా భక్తులు వైష్ణోదేవిని దర్శించుకునేందుకు భారీగా చేరుకున్నారు. దీనితో తొక్కిసలాట చోటుచేసుకుని కనీసం 12 మంది మరణించారు. 20 మంది గాయపడినట్లు అధికారులు శనివారం తెలిపారు.
 
 
శనివారం తెల్లవారుజామున జమ్మూకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట కొండలపై ఉన్న గర్భగుడి వెలుపల గేట్ నంబర్ మూడు దగ్గర తొక్కిసలాట జరిగింది. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు.

 
మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ మరియు నిత్యానంద్ రాయ్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. మాతా వైష్ణో దేవి భవన్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.