1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (09:34 IST)

తమిళనాడులో ఒకే రోజు 70 ఒమిక్రాన్ కేసులు: 1-8వరకు స్కూల్స్ మూసివేత

తమిళనాడును మరో ఉపద్రవం ముంచేలా ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు భయపెడుతుంటే.. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 70కి పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం భయానక పరిస్థితి కల్పించింది. ఒకే రోజు అన్ని కేసులు నమోదు కావడంతో అంతా అప్రమత్తమయ్యారు. తమిళనాడులో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 120కి చేరింది. 
 
తాజా పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని నిర్ణయించారు. 
 
అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్‌, థియేటర్లు, మెట్రోలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆంక్షలను కొత్త ఏడాది ప్రారంభం నుంచి జనవరి 30 వరకు కఠినంగా అమలు చేయాలని స్టాలిన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు కూడా సిద్దమైంది. 
 
కేవలం తమిళనాడే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ భూతం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది