మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జులై 2020 (16:31 IST)

కరోనా వేళ లింక్డ్‌ఇన్‌లో లే ఆఫ్.. 960 మంది ఉద్యోగాలు గోవిందా

LinkedIn
కరోనా వేళ ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో సోషల్ నెట్‌వర్క్ సంస్థ లింక్డ్‌ఇన్‌లో లే ఆఫ్ ప్రకటించడంతో 960 మంది సిబ్బంది ఉద్యోగాలను కోల్పోయారు. దేశంలో కరోనా విజృంభించిన నేపథ్యంలో... ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో ఉన్న ఉద్యోగులలో ఆరు శాతం మందిని సంస్థ కుదించింది. ఇందులో భాగంగా భారత్‌లో 960 మంది సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. 
 
ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఈ నిర్ణయం వరకే వర్తిస్తుందని, ఇక మరింత మందిని తొలగించే ఉద్దేశం లేదని మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డ్‌ఇన్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ర్యాన్‌ రాస్‌ల్యాన్‌స్కై పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల మందికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాయం చేస్తామని సంస్థ ప్రకటించింది.