శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (21:39 IST)

కరాచీలో సింగర్ నయ్యారా నూర్ కన్నుమూత

Nayyara Noor
Nayyara Noor
ప్రముఖ సింగర్ నయ్యారా నూర్ కరాచీలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం నాడు మరణించినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
పాకిస్తాన్‌కు చెందిన గొప్ప సింగర్స్‌లో ఈమె కూడా ఒకరు. ఈమె వయసు 71 సంవత్సరాలు కాగా, 'నైటింగేల్ ఆఫ్ పాకిస్తాన్' (బుల్ బుల్-ఎ-పాకిస్తాన్) అనే బిరుదును కూడా ఈమె పొందింది. 
 
నూర్…1950వ సంవత్సరంలో నవంబర్‌లో భారతదేశంలోని గౌహతి(అస్సాం)లో జన్మించింది. బాల్యంలోనే ఆమె కుటుంబం… పాకిస్తాన్ రాజధాని కరాచీకి మకాం మార్చడంతో అక్కడే ఆమె పెరిగింది.
 
లాహోర్‌లోని 'నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌' కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత.. 60లలో బుల్లితెరపై ఆమె సింగర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది.