ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (21:42 IST)

టుస్సాడ్స్ మ్యూజియం నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్

లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ మైనపు బొమ్మలను బ్రిటన్‌ రాయల్ కుటుంబం గ్రూప్‌ నుంచి వేరు చేసింది. వారిద్దరి మైనపు బొమ్మలను హాలీవుడ్ సెలబ్రెటీల సెక్షన్‌లోకి మార్చింది. 
 
ప్రముఖుల మైనపు విగ్రహాలు రూపొందించి వాటిని ప్రత్యేక మ్యూజియంలో ఏర్పాటు చేసే మేడమ్ టుస్సాడ్స్ నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే విగ్రహాలను తొలగించారు. 
 
కాగా, బ్రిటన్‌ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు ఏడాది కిందట రాజరికాన్ని వీడారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటున్న వీరు స్వతంత్ర జీవితం గడుపుతున్నారు. 
 
రాయల్ కుటుంబంపై ఆధారపడబోమని ప్రకటించిన ఈ దంపతులు తమ అర్జన కోసం నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై, ఆపిల్ టీవీతో కంటెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు.