సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (18:21 IST)

కాబోయే భార్యతో ఆ మాట అనేశాడు.. 60 రోజులు జైలు శిక్ష పడింది...?

నిశ్చితార్థం అయ్యాక కాబోయే భార్యతో ఫన్నీగా మాట్లాడటం.. సరదాగా జోకులేయడం మామూలే. అలా ఓ వ్యక్తి కాబోయే భార్యను సరదాగా ఇడియట్ అన్నాడు. అంతే.. ఆ పదాన్ని వాడిన పాపానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యతో చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్‌లో సరదాగా ఇడియట్ అని మెసేజ్ చేశాడు. దీంతో ఆమె వెంటనే ఆ వ్యక్తిపై కేసు పెట్టింది. 
 
విచారించిన న్యాయస్థానం 60 రోజుల పాటు జైలు శిక్ష, 20వేల దిర్హామ్స్ అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.3.90 లక్షల జరిమానా విధించిందని అక్కడి ఖలీజ్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. అబుదాబి చట్టాల ప్రకారం.. సోషల్ మీడియాల ద్వారా ఎవరినైనా దూషిస్తూ మెసేజ్‌లు పంపడం సైబర్ క్రైమ్ కింద నేరంగా పరిగణిస్తారు. అందుకే ఇడియట్ అన్న వ్యక్తికి జైలు శిక్ష పడిందని సదరు పత్రిక ప్రచురణలో పేర్కింది.