శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (15:10 IST)

కరోనా వైరస్‌ను ఓడించిన 103 యేళ్ల ఇటలీ వృద్ధురాలు

కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో కరోనా వైరస్ అపారమైన ప్రాణ, ఆస్తినష్టం మిగిల్చింది. అనేక వృద్దులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినపడిన అనేక మంది వృద్ధులను ఆస్పత్రుల్లో కూడా చేర్చుకోలేదు. దీంతో వారంతా రోడ్లపైనే కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. ఈ కరోనా మహమ్మారి ఇటలీలో అంతలా కరాళ నృత్యం చేసింది. 
 
అలాంటి పరిస్థితుల్లో కూడా నార్త్ ఇటలీకి చెందిన 103 యేళ్ళ వృద్ధురాలు ఈ వైరస్ బారినపడి విజయవంతంగా తిరిగికోలుకుంది. ఆ శతాధిక వృద్ధురాలి పేరు అడ జనుస్సో. ఈమె కరోనా వైరస్ బారినపడి.. ఓ నర్సింగ్ హోంలో చికిత్స పొంది, ఈ వైరస్ నుంచి విముక్తిపొందింది. దీనికి కారణం.. ఆ వృద్ధురాలి కుటుంబానికి చెందిన ఫ్యామిలీ వైద్యురాలు. ఆమె ఇచ్చిన సూచనలు, సలహాలతో పాటు.. నూరిపోసిన ధైర్యంతో కోలుకుంది. ప్రస్తుతం ఈ వృద్ధురాలు పత్రికలు చదువుతూ, టీవీలు చూస్తూ తన ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది.