శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 జులై 2023 (16:53 IST)

ఆడ మొసలిని పెళ్లాడిన నగర మేయర్.. ఎక్కడ?

crocodile marriage
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉండే ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. తాజాగా ఓ నగర మేయర్ మాత్రం ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. బంధువులు, మిత్రులు సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరుపుకున్నాడు. ఈ తంతు పూర్తయ్యా తన కొత్త భార్యతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ అందర్నీ సంతోషపెట్టాడు. తమ పూర్వీకులకాలంలో ఈ వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని, దాదాపు 230 యేళ్ల తర్వాత మళ్లీ ఈ వివాహం జరిగిందని, ఇది తమ సంప్రదాయంలో భాగంగానే జరిపించామన్నారు. పైగా, నగరంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నదే తమ బలమైన ఆకాంక్ష అని చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శాన్ పెడ్రో వ్యూవామెలులా టౌన్ మెయర్ విక్టర్ హ్యూగో సోసా ఛోంతాల్ తెగకు చెందిన వారు. ఈయన తెగలో పాలకులు ఆడ మొసలిని పెళ్లాడటం వారి పూర్వీక సంప్రదాయంగా వస్తుంది. తమ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని, వారికి అదృష్టం కలగాలని కోరుకుంటూ ఛోంతాల్ తెగ రాజులు ఈ తంతు నిర్వహించేవారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆకుపచ్చ దుస్తులను ఆడ మొసలికి ధరించి, అందంగా ముస్తాబు చేసి ఇంటికి తీసుకొచ్చారు. 
 
ఆ తర్వాత జనమంతా మొసలిని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తారు. ఈ తంతు జరిగేటపుడు మొసలి నోటిని కట్టేసి ఉంచుతారు. ఆ తర్వాత ఆ మొసలిని తెల్లని దుస్తులతో అలంకరించి వివాహ వేదికకు తరలిస్తారు. సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేసి రాజు మొసలిని వివాహం చేసుకుంటారు. పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈ వివాహ ఘట్టాన్ని నిర్వహించినట్టు మేయర్ విక్టర్ వివరించారు.