మెక్సికోలో దారుణం.. 40 మంది సజీవదహనం .. ఎలా?
మెక్సికో దేశంలో ఘోరం జరిగింది. ఓ బస్సుకు నిప్పంటుకోవడంతో ఏకంగా 40 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణిస్తుండగా బస్సును ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మెక్సికో దేశంలోని టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సభవించింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులోని 48 మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనలో ట్రక్కు ట్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.