గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (07:13 IST)

భారీ భూకంపం... చిగురుటాకులా వణికిన మెక్సికో సిటీ (Video)

మెక్సికోను భారీ భూకంపం వణికించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. దీంతో మెక్సికోలోని బహుళ అంతస్తు భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.

మెక్సికోను భారీ భూకంపం వణికించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. దీంతో మెక్సికోలోని బహుళ అంతస్తు భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఈ భూకంపం ధాటికి ఇప్పటికే 105 మంది చనిపోయినట్టు సమాచారం. కూలిపోయిన భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకునివున్నట్టు సమాచారం. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. 
 
బుధవారం తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం ధాటికి మెక్సికో నగరం చిగురుటాకులా వణికింది. భవనాలు కుప్పకూలిపోయాయి. నేల నోరుచాచి భారీ భవంతులు, మనుషులను తనలోకి లాగేసుకుంది. దీంతో వందలాది మంది శిధిలాల కింద చిక్కుకుపోయారు. వేలాది మందికి గాయాలయ్యాయి. ప్రాణభీతితో ప్రజలు పరుగులు తీశారు. వేగంగా స్పందించిన ప్రభుత్వం సహాయకచర్యలు ప్రారంభించింది. సీసీ కెమెరాల్లో భూకంపానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.