ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (10:54 IST)

శృంగార తారలకు 2.80 లక్షల డాలర్లు చెల్లించిన డోనాల్డ్ ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో చుక్కెదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు శృంగారతార తనపై ఆరోపణలు గుప్పించకుండా ఉండేందుకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్టు తేలింది. ఈ విషయాన్ని

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో చుక్కెదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు శృంగారతార తనపై ఆరోపణలు గుప్పించకుండా ఉండేందుకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్టు తేలింది. ఈ విషయాన్ని ట్రంప్ వద్ద సహాయకులుగా పని చేస్తున్న వారు కోర్టులో అంగీకరించారు. దీంతో వారిద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌తో సంబంధాలపై నోరెత్తకుండా ఉండేందుకు శృంగారతార స్టార్మీ డేనియెల్స్‌కు భారీగా ముడుపులు చెల్లించినట్లు ట్రంప్‌ మాజీ లాయర్‌ మైకేల్‌ కోహెన్‌ మంగళవారం కోర్టులో అంగీకరించారు. దీంతో మోసం కేసులో ట్రంప్‌ ఎన్నికల మాజీ ప్రధాన ప్రచారకర్త పాల్‌ మనాఫోర్ట్‌ కూడా దోషిగా తేలారు. 
 
ట్రంప్‌తో అక్రమ సంబంధాలకు సంబంధించి ఇద్దరు మహిళల నోరు మూయించిన కేసులో కోహెన్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది. పన్ను ఎగవేత, బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రచార సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడటం తదితర కేసుల్లోనూ ఆయన దోషిగా తేలారు. ఈ ఇద్దరు మహిళలనోరు మూయించేందుకు 2.80 లక్షల డాలర్లు చెల్లించినట్లు కోహెన్‌ ఒప్పుకున్నారు.