మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (11:29 IST)

భారతీయులకు గుడ్ న్యూస్.. ఏడేళ్లు పనిచేస్తే గ్రీన్‌కార్డు

అమెరికా సర్కారు భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఏడేళ్ల పాటు హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తే గ్రీన్‌కార్డు జారీకి చట్ట సవరణ బిల్లు సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌లో సవరణలు చేశారు.

కొన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న భారతీయ టెక్ నిపుణులకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు సవరిస్తూ రూపొందించిన బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం అమెరికాలో వరుసగా ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డు పొందడానికి అర్హత సాధించినట్లేనని అధికారులు తెలిపారు. 
 
ఈ బిల్లును సెనెటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించగా, ఇతర సెనెటర్లు ఎలిజబెత్ వారెన్‌, బెన్‌రాయ్ లుజాన్‌, డిక్ దుర్బిన్ మద్దతు పలికారు. అమెరికా ప్రజా ప్రతినిధుల సభలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఉమన్ జో లాఫ్‌గ్రెన్‌.

ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాపై పని చేస్తున్న వారితో సహా 80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇందులో హెచ్‌-1బీ వీసా దారులు, దీర్ఘకాలం వీసాపై పనిచేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్ కార్డు డ్రీమర్లు, తదితరులకు గ్రీన్ కార్డు లభిస్తుంది.