న్యూజిలాండ్‌ ఎన్నికలు మళ్లీ వాయిదా..ఎందుకో తెలుసా?

newzealand prime minister
ఎం| Last Updated: బుధవారం, 19 ఆగస్టు 2020 (08:43 IST)
న్యూజిలాండ్‌ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. కరోనా కేసులు మళ్లీ నమోదవుతుండటంతో నాలుగు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ ప్రకటించారు.

సెప్టెంబరు 19 నుంచి జరగాల్సిన ఎన్నికలను అక్టోబరు 17కి వాయిదా వేస్తున్నట్టు ఆమె తెలిపారు. 102 రోజుల తరువాత గత వారం దేశంలోని అతి పెద్ద నగరమైన ఆక్లాండ్‌లో ఓ కరోనా కేసు నమోదైంది. న్యూజిలాండ్‌లో గత వారం నుంచి ఇప్పటివరకూ 49 కేసులు నమోదయ్యాయి.

దీంతో గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు ప్రచారాన్ని నిలిపివేశాయి. ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై మరింత చదవండి :