గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మే 2022 (17:23 IST)

నైజీరియాలో విషాదం.. పెరుగుతున్న మృతులు

Nigeria
నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్​కోర్ట్​ పట్టణంలోని ఓ చర్చ్ స్థానిక పోలో క్లబ్‌లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం భారీగా ప్రచారం చేశారు. ఆహారంతో పాటు మంచి గిఫ్టులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో చర్చీ దగ్గరకు జనాలు భారీగా తరలివచ్చారు. 
 
ఫుడ్, గిఫ్టులు తీసుకునేందుకు క్యూలో నిలబడ్డారు. అయితే డొనేషన్ డ్రైవ్ నిర్వహకుల అంచనా కంటే భారీగా ప్రజలు అక్కడికి వచ్చారు. దీంతో పంపిణి కష్టంగా మారింది. అదే సమయంలో క్యూలో నిల్చున్న జనాలు అసహనానికి లోనయ్యారు. తమ వంతు వరకు వస్తుందా రాదా అన్న ఆందోళనతో.. ఒక్కసారిగా ముందుకు ఎగబడ్డారు.
 
దీంతో క్యూలెన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై సమాచారం రాగానే అక్కడికి వెళ్లిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్థు చేస్తున్నారు. సరైన వసతులు లేకుండా డొనేషన్ డ్రైవ్ నిర్వహించిన నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు