సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (17:20 IST)

ఉత్తర కొరియా సంచలన ప్రకటన.. 10 మిసైల్స్‌ ప్రయోగం

North Korea
North Korea
ఉత్తర కొరియా ఓ సంచలన ప్రకటన చేసింది. టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను తయారుచేసినట్లు తెలిపింది. మరో విషయం అంటే.. ఈ సబ్‌మెరైన్ నుంచి అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 
 
ఈ కొత్త సబ్‌మెరైన్‌కు హీరో కిమ్ గన్-ఓకే అని నామకరణం చేశారు. అయితే దీని హల్ నెంబర్ 841. ఈ సబ్‌మెరైన్‌ నుంచి రెండు వరుసల్లో ఏకంగా 10 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు. 
 
ఇక రష్యా సబ్‌మెరైన్‌లో ఉత్తరకొరియా చాలా మార్పులు చేసినట్లు నిపుణులు అంటున్నారు. ఇది కేవలం అణుదాడి మాత్రమే చేసేది కావచ్చని.. ఈ సబ్‌మెరైన్ అణుశక్తితో నడిచేది కాకపోవచ్చని అమెరికా నిపుణులు చెప్తున్నారు. ఇదే సమయంలో సరికొత్త న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను ప్యాంగ్యాంగ్ ఆవిష్కరించింది.