గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (10:41 IST)

ఆయుధ పరీక్షతో సత్తా చాటిన ఉ. కొరియా...

మరోమారు ఆయుధ పరీక్షతో ఉత్తర కొరియా మరోమారు సత్తా చాటింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా ఈ ఆయుధ ప్రయోగ పరీక్షను వీక్షించడం గమనార్హం. 
 
ఈ విషయాన్ని ఉత్తర కొరియా ఓ ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు సాగిస్తున్న దక్షిణ కొరియాతో చర్చలు జరిపేది లేదని, ఇకపై అమెరికాతో మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది. అమెరికాతో త్వరలో చర్చలు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తరకొరియా ఆదివారం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
అమెరికా, దక్షిణ కొరియాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక విన్యాసాలు ముగిసిన తర్వాత అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ కిమ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఉత్తర కొరియా ఈ మేరకు స్పందించడం గమనార్హం. 
 
మరోవైపు, అమెరికా, రష్యా మధ్య కుదిరిన ఐఎన్‌ఎఫ్‌ (ఇంటర్మీడియెట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ట్రీటీ) ఒప్పందం రద్దయింది. న్యూ స్టార్ట్‌ (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం)కు కాలం చెల్లిపోయిందని ట్రంప్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి అమెరికాకు సవాల్‌ విసరడం గమనార్హం.