1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (11:45 IST)

ఉత్తర కొరియాలో ఇద్దరు యువకులకు 12 ఏళ్ల జైలు శిక్ష..

jail
ఉత్తర కొరియాలో ప్రముఖ బ్యాండ్ బృందం నుంచి సంగీతం విన్న పాపానికి ఇద్దరు యువకులకు 16 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కఠిన నిర్ణయాలతో ప్రపంచం దేశాలు వణికిపోతున్నాయి. 
 
ఉత్తర కొరియా క్షిపణుల దాడులతో అమెరికా, జపాన్‌లతో ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురవుతున్నాయి. ఉత్తర కొరియాలో అధ్యక్షుడి పేరిట ఎవ్వరూ వుండకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఆ ఇద్దరు మైనర్లు చేసిన ఏంటంటే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో చూడటమే. 
 
అదేదో చూడకూడని వీడియోనో, సీక్రెట్ వీడియోనో కాదు. ఉత్తర కొరియాకు సంబంధించిన సినిమా పాట. ఇద్దరు 16 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయిలు.. ఉత్తర కొరియాకు సంబంధించి కే పాప్ పాట చూసినందుకు వారికి శిక్ష విధించారు.