శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (14:14 IST)

స్లిమ్ ఫిగర్‌తో వార్తల్లో నిలిచిన కిమ్ జాంగ్ - ఉన్

kim
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ -ఉన్ తన స్లిమ్ ఫిగర్‌తో వార్తల్లో నిలిచాడు. గుర్తుపట్టలేని విధంగా స్లిమ్‌గా వున్నాడు. వార్షిక అధికార పార్టీ సమావేశంలో ఆయన మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు.  
 
ఈ నెల ప్రారంభంలో  కొరియా వర్కర్స్ పార్టీ 8వ కేంద్ర కమిటీ యొక్క 4వ ప్లీనరీ సమావేశంలో మొదటిసారి బహిరంగంగా కనిపించినప్పుడు, అతను చాలా సన్నగా కనిపించాడు.
 
అధికార వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశానికి కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షత వహించారు. కానీ సమావేశంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు రాలేదు. ప్లీనరీ సమావేశం 2021 సంవత్సరానికి ప్రధాన పార్టీ,  విధానాల అమలుపై చర్చించినట్లు ఆ దేశ మీడియా ఊటంకించింది.
 
ఇకపోతే కిమ్, అధిక బరువును కలిగివున్నారు. ఈయనకు ధూమపానం సంవత్సరాలుగా వున్నట్లు ఊహాగానాలున్నాయి. ముఖ్యంగా అతని కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. 2025లో చైనాతో తన సరిహద్దును తిరిగి తెరిచే వరకు తక్కువ ఆహారం తినాలని కిమ్ అక్టోబర్‌లో తన పౌరులకు చెప్పారు, అయితే ఈ ఏడాది మాత్రమే ఉత్తర కొరియా సుమారు 860,000 టన్నుల ఆహారం తక్కువగా ఉందని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది.