1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (13:46 IST)

నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్న 100 మంది గ్రామస్థులు... ఎక్కడ?

Landslides
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన పాపువా న్యూగినియాలో విషాదం చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడటంతో వంద మందికిపై గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కొండ చరియలు ఓ గ్రామంపై పడ్డాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఆ గ్రామస్థులు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. అంతేకాకుండా, కొండ చరియలు విరిగిపడటంతో ఆ గ్రామం మొత్తం నేలమట్టమైంది. రాజధాని పోర్ట్ మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని కావోకలం అనే గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 
 
గ్రామస్థులు గాఢనిద్రలో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం. అయితే, మృతుల సంఖ్యపై అధికారులు మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలాగే, సహాయ చర్యలకు కూడా వర్షం అడ్డంకిగా మారింది. ఈ ఘటనపై ప్రధాని జేమ్స్ మార్పే తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.