ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (12:51 IST)

మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు.. బీజేపీదే హవా.. కాంగ్రెస్ వెనక్కి

Madhya Pradesh Assembly 2023 Results
దేశంలో 3 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 116 సీట్లను గెలుచుకోవాలి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 138 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే ముందందలో వున్నారు. 
 
కాంగ్రెస్ అభ్యర్థులు 89 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే, ఫలితాల్లో మాత్రం ఇప్పటి వరకు బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళుతోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో తొలిరౌండ్‌లో బీజేపీ 138 చోట్ల లీడ్‌లో ఉంది.