1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (12:50 IST)

రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన.. నలుగురు మృతి

Landslides
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. రాయగఢ్ జిల్లాలో నిన్న అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు చిక్కుకున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
రాయ్‌గఢ్ జిల్లాలోని ఆరు ప్రధాన నదుల్లో సావిత్రి, పాతాళగనగ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ముంబయి, రాయ్‌గఢ్, పాల్ఘార్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబయిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.