ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (11:13 IST)

అహ్మదాబాద్‌లో ఇస్కాన్ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం- తొమ్మిది మంది మృతి

Accident
అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్ వద్ద మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు తొమ్మిది మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. 
 
గురువారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని గుజరాత్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సత్య పటేల్‌కు కూడా గాయాలయ్యాయి.
 
ఈ ఘటనతో ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. SUV వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.