1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 జులై 2023 (15:03 IST)

కిండర్‌గార్డెన్‌లో బీభత్సం.. ఆరుగురుని కత్తితో పొడిచిన యువకుడు

knife
చైనా దేశంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ కిండర్‌‌గార్డెన్‌లోకి ప్రవేశించిన 25 యేళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిని ఉద్దేశ్వపూర్వక దాడిగా పేర్కొన్న చైనా పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశఆరు. బాధితుల్లో ఒకరు టీచర్ కాగా, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మరొకరు గాయపడగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. చైనాలో ఇటీవలి కాలంలో కత్తిపోట్ల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా స్కూళ్లే లక్ష్యంగా దండుగులు దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాఠశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గత యేడాది ఆగస్టులో జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్డెన్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.