సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:08 IST)

జె-10సి యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ తన మిత్రదేశమైన చైనా నుంచి 25 బహుళ ప్రయోజనకర జె-10సి యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు సమాధానంగా ఈ విమానాలను పాక్ కైవసం చేసుకుంది. 
 
దీనిపై పాక్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో విలేకరులతో మాట్లాడుతూ అన్ని వాతావరణాలను తట్టుకునే సామర్ధంగల 25 జె -10సి యుద్ధ విమానాలు వచ్చే ఏడాది మార్చిలో పాకిస్తాన్ దినోత్సవ పెరేడ్‌లో పాల్గొంటాయని చెప్పారు.
 
మార్చి 23న జరిగే పాకిస్తాన్ దినోత్సవంలో మొట్టమొదటిసారి విఐపి అతిథులు హాజరవుతున్నారని, రఫేల్‌కు సమాధానంగా పాకిస్తాన్ వైమానిక దళం జె-10సి ఫైటర్ జెట్లతో విన్యాసాలు చేస్తుందని ఆయన తెలిపారు.