సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:43 IST)

ఏకంగా 730 రోజులు సెలవులు కావాలట.. లీవ్ లెటర్ వైరల్

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 730 రోజులు సెలవు కావాలట. ఇదేంటి? ఇన్ని రోజులు లీవ్ కావాలని అడిగాడా.. అనుకుంటున్నారు కదూ. అవునండి. ఇది నిజం. దాయాది పాకిస్థాన్‌కు చెందిన రైల్వే అధికారికి సంబంధించిన లీవ్ లె

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 730 రోజులు సెలవు కావాలట. ఇదేంటి? ఇన్ని రోజులు లీవ్ కావాలని అడిగాడా.. అనుకుంటున్నారు కదూ. అవునండి. ఇది నిజం. దాయాది పాకిస్థాన్‌కు చెందిన రైల్వే అధికారికి సంబంధించిన లీవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే… హనీఫ్ గుల్ పాక్ రైల్వే డిపార్ట్ మెంట్‌లో గ్రేడ్ 20 అధికారి. ఉద్యోగం పట్ల నియబద్ధతగా ఉండే హనీఫ్‌కు కొత్తగా రైల్వే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న షేక్ రషీద్ పనితీరు నచ్చడం లేదట. అందుకే రైల్వే మంత్రిగా పనిచేసేందుకు ఆయన అసలు అర్హతే లేదని గుల్ ఆరోపిస్తున్నాడు. ఇంకా సదరు మంత్రితో కలిసి తాను పనిచేయలేనని తనకు సెలవులు కావాలంటూ తన పై అధికారికి హనీఫ్ లీవ్ లెటర్ రాశారు. 
 
ఈ లెటర్లో తనకు ఏకంగా 730 రోజులు సెలవు కావాలని, అది కూడా పూర్తి వేతనంతో కూడిన లీవ్ మంజూరు చేయాలని కోరాడట. ఒకవేళ రెండేళ్ల తర్వాత మంత్రి తీరు మారితే అప్పుడు ఉద్యోగంలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని చెప్పాడట. ఈ విషయం కాస్త మీడియాకు తెలియడంతో ఆ లెటర్ వైరల్ అయ్యింది. నెటిజన్లు మాత్రం హనీప్ పనితీరుకు ఈ లెటరే నిదర్శనమని సెటైర్లు విసురుతున్నారు.