శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (15:34 IST)

ఇతర దేశాల కోసం యుద్ధం చేయం : ఇమ్రాన్ ఖాన్

ఇతర దేశాల కోసం యుద్ధం చేసే ప్రసక్తే లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. ఇలా చేయడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నట్టు పేర్కొన్నారు.

ఇతర దేశాల కోసం యుద్ధం చేసే ప్రసక్తే లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. ఇలా చేయడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నట్టు పేర్కొన్నారు.
 
రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ప్రసంగించారు. భవిష్యత‌లో ఏ దేశం కోసం పాకిస్థాన్ యుద్ధం చేయబోదని తేల్చి చెప్పారు. మొదటి నుంచీ యుద్ధమనే విధానానికి తాము వ్యతిరేకమని, తమ ప్రభుత్వ విదేశాంగ విధానం దేశ ప్రయోజనాలను బట్టే ఉంటుందని స్పష్టం చేశారు. 
 
ఉగ్రవాదంపై యుద్ధంలో భాగంగా పాకిస్థాన్ జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇక ఏ దేశం కోసం పాకిస్థాన్ యుద్ధం చేయబోదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. అయితే ఉగ్రవాదంతో సమర్థంగా పోరాడిన పాక్ సాయుధ బలగాలపై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు. 
 
తమ దేశంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. కానీ, విభిన్న వాతావరణం నెలకొనివుందనీ ఆ కారణంగానే దేశంలో అస్థిరత నెలకొందన్నారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.