గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (10:52 IST)

కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతి: అమెరికా

అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతిస్తామని యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సిడిసి) త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఈ ఉత్తర్వులు జారీ అయితే జనవరి 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. యుకెలో కరోనా స్ట్రెయిన్‌ ఉధృతి  నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

ఇతర దేశాల్లోనూ కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వెలుగుచూస్తుండడంతో ప్రయాణికులపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

సిడిసి ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తించనుంది.