గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (13:00 IST)

స్మార్ట్ ఫోన్ వాడకుండా వస్తే పిజ్జా ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

అగ్రరాజ్యం అమెరికాలో ఓ పిజ్జా షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్ లేకుండా షాపుకు వెళ్ళి తింటే.. పిజ్జా ఫ్రీ అంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, కాలిఫోర్నియా ప్రావిన్స్‌లోని ప్రెరెస్నో నగరంలోని పిజ్జా సెంటర్.. తమ సంస్థకు వచ్చే భుజించే కస్టమర్లకు.. అదీ స్మార్ట్ ఫోన్ లేకుండా తినే వారికి పిజ్జా ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. 
 
టీమ్‌గా వచ్చే కస్టమర్లలో నలుగురైనా సెల్ ఫోన్ ఉపయోగించకుండా వుంటేనూ పిజ్జా ఉచితం అని తెలిపింది. ఈ షాపుకు వెళ్లే కస్టమర్లు వెళ్తూ వెళ్తూ సెల్ ఫోన్లను రిసెప్షన్ల‌లోనే ఇచ్చేయడం చేయాలట. ఈ స్మార్ట్‌ఫోన్ వాడకంతో కుటుంబ సభ్యులతో గడిపే సమయం తక్కువగా వుందని.. స్మార్ట్ ఫోన్స్  లేకుండా ఆహారం తీసుకోవడం ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుందని సదరు పిజ్జా సంస్థ వెల్లడిస్తోంది.