గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:54 IST)

పాకిస్థాన్‌ని కట్టడి చేసే సమయం ఆసన్నమైంది: న‌రేంద్ర మోడీ

పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్న

పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో అమెరికా, చైనా అధ్యక్షులు కూడా హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఓ పొరుగు దేశం తీవ్రవాదాన్ని తయారు చేసి, దాన్ని రవాణా చేస్తోంద‌ని మండిపడ్డారు. ఇలాంటి చర్యల తమ దేశంలో మధ్య అశాంతి నెల‌కొల్పి, హింసను ప్రేరేపిస్తోందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పాక్‌ను నియంత్రించే సమయం ఆసన్నమైందన్నారు.