కాలిఫోర్నియాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతగా నమోదు
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం ఏర్పడింది. శుక్రవారం ఉదయం 5.5 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
కాలిఫోర్నియాలోని ఈస్ట్ షోర్‌కు 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
మరోవైపు జపాన్ రాజధాని టోక్యో పరిసర ప్రాంతాలలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. చాలామంది గాయపడ్డారనీ, స్వల్ప నష్టం కలిగినట్లు చెప్పారు.