బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (18:45 IST)

ర్యాట్ క్యాచర్‌ ఉద్యోగం... వేతనం రూ.1.2 కోట్లు.. ఎక్కడ?

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎలుకలు ఉంటాయి. ఇలావున్నపుడు పిల్లలుతో వాటిని చంపేస్తుంటారు. అయితే, అమెరికాలో మాత్రం పిల్లులను పెంచడం మానేసి... ఎలుకలు పట్టేందుకు కొత్తగా ర్యాట్ క్యాచర్ ఉద్యోగాన్ని సృష్టించారు. ఈ పోస్టుకు ఎంపికయ్యే వారికి రూ.1.2 కోట్ల మేరకు వేతనం అందించనున్నారు. ఈ ఉద్యోగ ఆఫర్ ఎక్కడో కాదు... న్యూయార్క్ నగరంలోనే. వినేందుకు ఎంతో ఆశ్చర్యంగా ఉన్న ఈ విషయం గురించి ఆరా తీస్తే... 
 
కొన్నేళ్లుగా న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ఎలుకల సమస్యతో బాధపడుతున్నాయి. సబ్ వేలు, డ్రైనేజీలు, పార్కులు ఇలా ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు కనిపిస్తున్నాయి. వాటి సంతతి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కొత్తగా ర్యాట్ క్యాచర్ అనే ఉద్యోగాన్ని సృష్టించారు. 
 
ఈ ఉద్యోగం కోసం 900 మంది దరఖాస్తు చేసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ రొడెంట్ మిటిగేషన్ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 900 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో కేథలిన్ కొరాడీని ఎంపిక చేశారు. ఓ స్కూల్‌లో టీచరుగా పనిచేసిన ఆమె విద్యాశాఖలో ఎలుకలు నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై చిన్నపాటి రీసెర్స్ చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన ఆమె... ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను, ఎలుకలకు దొరక్కుండా డిస్పోస్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం. సబ్ వేలలో ఎలుకలు ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా చేయడమే. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... విష పదార్థాలు పెట్టి ఎలుకలను చంపకూడదు. ఇంతకుముందు అలా చేస్తే ఆ విష పదార్థాలను, వాటిని తిని చనిపోయిన ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు చనిపోయాయట. అందుకే విషం పెట్టొద్దన్న రూల్ పెట్టారు.