సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:44 IST)

షాకింగ్: 2300 మంది ఉగ్రవాదులను విడుదల చేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ తరువాత, వారి అసలు రూపం క్రమంగా తెరపైకి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, తాలిబాన్లు గత నాలుగైదు రోజుల్లో ఏకంగా 2,300 మంది ఉగ్రవాదులను వివిధ జైళ్ల నుండి విడుదల చేశారు.
 
వీరిలో తాలిబాన్, అల్ ఖైదా, టిటిపికి చెందిన చాలా మంది తీవ్రవాదులున్నారు. వారందరూ మొన్నటివరకూ ఆఫ్ఘనిస్తాన్‌లోని జైళ్లలో ఉన్నారు, వారి సంఖ్య దాదాపు 2300 వరకు వుంటుందని చెపుతున్నారు.
 
మరోవైపు, తెహ్రికే తాలిబాన్ పాకిస్థాన్ (టిటిపి) ఉగ్రవాదుల విడుదలపై పాకిస్థాన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లో టీటీపీ యాక్టివ్‌గా ఉంది. విడుదలయిన వారిలో బైతుల్లా మెహసూద్, వకాస్ మెహసూద్, హంజా మెహసూద్, జర్కావి మెహసూద్, జైతుల్లా మెహసూద్, ఖరీ హమీదుల్లా మెహసూద్, హమీద్ మెహసూద్ మరియు మజ్దూర్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేసింది.