గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (13:02 IST)

ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య... రోడ్డుపై ల్యాండైన విమానం (వీడియో)

విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఓ విమానం నడిరోడ్డుపై ల్యాండైంది. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, కాలిఫోర్నియాకు చెందిన పైలట్ లిజ్జి స్లోడ్(24) తన స్నేహితునితో కలిసి శాండిగ

విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఓ విమానం నడిరోడ్డుపై ల్యాండైంది. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, కాలిఫోర్నియాకు చెందిన పైలట్ లిజ్జి స్లోడ్(24) తన స్నేహితునితో కలిసి శాండిగో నుంచి వాన్యూస్ వెళ్తుండగా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. 
 
ఈ సమస్యను గ్రహించిన పైలట్ మళ్లీ ఇంజిన్‌ను స్టార్ట్ చేయకుండా రోడ్డుపైనే ల్యాండ్ చేసి పెనుప్రమాదం నుంచి సురక్షితంగా తాను, తన స్నేహితుడు బయటపడ్డారు. తాను విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ భారీగా లేకపోవడం నిజంగా అద్భుతమేనని స్లోడ్ పేర్కొన్నాడు. అనుభవం గల పైలట్ కావడం వల్లే చాకచక్యంతో విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేశాడని కోస్తా మెసా ఫైర్, రెస్క్యూ టీం ట్వీట్ చేసింది.