శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (09:35 IST)

ఇండోనేషియాలో భారీ భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ఆదివారం ఉదయం 5.17 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 
 
యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు... భూకంప కేంద్రం టొబెలోకు 259 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 174.3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు గుర్తించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు.