మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (15:48 IST)

మలాలా యూసుఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాది పరార్

2012లో పాకిస్థాన్‌లోని స్వాట్ వ్యాలీలో విద్యా హక్కుల గురించి ప్రచారం చేస్తున్న సమయంలో నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత పాకిస్థాన్‌కు చెందిన మ‌లాలా యూసుఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆమెపై కాల్పులు జరిపిన తాలిబన్ ఉగ్రవాది ఇషానుల్లా జైలులో ఇంతవరకు వున్నాడు. అయితే ఇషానుల్లా ప్రస్తుతం జైలు నుంచి తప్పించుకున్నాడు. 
 
ఈ మేరకు సదరు ఉగ్ర‌వాది ఆడియో క్లిప్‌‌ను విడుదల చేసాడు. తాను పోలీసుల చెర నుంచి త‌ప్పించుకున్న‌ట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జనవరి 11వ తేదీన పోలీసుల చెర నుంచి అతను తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా 2017లో పోలీసులు ఇషాన్‌ను అరెస్టు చేశారు. 2012లో మ‌లాలాపై ఈ ఉగ్ర‌వాది ఇషాన్ కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో మ‌లాలా త‌ల‌లోకి బుల్లెట్ దిగింది. 2014లో పెషావ‌ర్‌లో ఆర్మీ స్కూల్‌పై జ‌రిగిన దాడికి కూడా ఇత‌గాడే కార‌కుడు కావడం గమనార్హం. ఈ దాడిలో 134 మంది స్కూల్ పిల్లలు, 15 మంది సిబ్బంది మరణించారు.