మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (16:12 IST)

స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు.. జీలం నదిలో కొట్టుకుపోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పో

స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని జీలం నదీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చెందిన అలీ అబ్రార్ స్నేహితులతో స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు. జోరుగా ప్ర‌వ‌హిస్తున్న జీలం న‌దిని ఈదుతూ దాటితే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ఫ్రెండ్స్ చెప్పడంతో.. దూకి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. 
 
నదిలోకి దూకేందుకు ముందు స్నేహితులతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించిన ఆ యువకుడు.. నీళ్లల్లోకి దూకిన తర్వాత ప్రవాహ ధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. ఇతని మృతదేహం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో అలీ తండ్రి ఫిర్యాదు మేరకు అతని స్నేహితులు ఒసామా, త‌ల్హా, జెష‌న్‌, షోయ‌బ్‌, రాహ‌త్‌ల‌ను అరెస్ట్ చేశారు.