గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (14:14 IST)

ప్రజా ప్రతినిధిగా వుండి.. పోర్న్ చూస్తూ దొరికిపోయాడు...

ప్రజా ప్రతినిధిగా వుండి.. పోర్న్ చూస్తూ దొరికిపోయాడు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌లోని పార్లమెంటు భవనంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే హాలులో ఉన్న ఎంపీ రొన్నాతెప్ అనువాత్ ఫేస్ మాస్క్ తీసి కూర్చున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మెల్లగా ఫోన్ తీసి పోర్న్ చూడటం ప్రారంభించారు. 
 
ఓ వైపు ముఖ్యమైన సమావేశం జరుగుతుంటే ఆయన మాత్రం పోర్న్ ఫోటోలు చూస్తుండిపోయారు. అలా 10 నిమిషాల పాటు ఆయన ఫోన్‌లోనే ముఖం పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో సదరు ఎంపీ ఖంగుతిన్నారు.