బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 5 మే 2021 (17:28 IST)

దారుణంగా భారత్‌ పరిస్థితి.. సైన్యాన్ని దించండి: అమెరికా

ఇండియాలో కరోనా పెద్ద ఎత్తున ఆందోళనకర స్థాయిలో ఉందంటూ అమెరికాకు చెందిన నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తక్షణమే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలనీ, సర్వ శక్తులు ఉపయోగించి కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలంటూ అయన సూచించారు.

కరోనా రోగులకు వైద్య సామగ్రి పంపిస్తే సరిపోదు అని, వైద్య సిబ్బందిని కూడా భారత్‌కి పంపి గడ్డు కాలంలో ఉన్న దేశాన్ని రక్షించాలని అయన కోరారు. ఇప్పటికే రెండు కోట్ల మందికి ఈ వైరస్ సోకగా రెండు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.