తిమింగలాలు సముద్రంలోనే వుండవట.. నడుస్తాయ్.. పరిగెడుతాయట..
సముద్రంలో నివసించే అతిపెద్ద జీవి అయిన తిమింగలం నీళ్లలో నివాసం వుంటుందని అందరికీ తెలిసిందే. కానీ సముద్రంలో నివసించే ఈ అతిపెద్ద జీవి అయిన తిమింగిలానికి ఒకప్పుడు నాలుగు కాళ్లు ఉండేవట. ఇవి అప్పట్లో ఉభయచర జీవులుగా ఉండేవని తాజాగా లభ్యమైన శిలాజాలను బట్టి శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకు వచ్చారు.
పెరూలో లభ్యమైన ఈ తిమింగలం అవశేషం భారత్, పాకిస్థాన్ అవతల పసిఫిక్ ప్రాంతం, దక్షిణార్ధగోళంలో లభించిన మొట్టమొదటి శిలాజమని శాస్త్రవేత్తలు తెలిపారు. 43 మిలియన్ సంవత్సరాల నాటిదిగా చెప్తున్న ఓ శిలాజం పెరూలో లభ్యమైంది. 13 అడుగుల పొడువున్న దీనికి నాలుగు కాళ్లు వుండటంతో శాస్త్రవేత్తలు షాకయ్యారు.
అంతేకాకుండా తిమింగలాలు పూర్తిగా నీటికి పరిమితం కావడానికి ముందు భూమిపైనా సంచరించేవని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇవి నడవటం కాదు.. పరిగెత్తేవి కూడా చేసేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏడుగురు శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసింది.