సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (11:14 IST)

ఆర్టికల్ 370 రద్దు... యుద్ధానికి దారితీయొచ్చు.. అణ్వస్త్ర వార్నింగా? : ఇమ్రాన్ ఖాన్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడం పట్ల పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆర్టికల్ 370 రద్దు అణు యుద్ధానికి దారితీయొచ్చని అభిప్రాయాపడ్డారు. ముఖ్యంగా, భారత్‌లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఎంతటి దుష్పరిణామాలను ఆ దేశం ముందు ఉంచనుందో అతి త్వరలోనే తెలుస్తుందన్నారు. 
 
పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్, పుల్వామా తరహాలో మరిన్ని దాడులు జరగవచ్చని హెచ్చరించారు. భారత్ చర్యను తీవ్రంగా ఆక్షేపించిన ఆయన, ఈ నిర్ణయం తన ప్రభావాన్ని చూపకముందే పాలకులు మేల్కొనాలన్నారు. రెండు దేశాల మధ్యా యుద్ధం జరిగే పరిస్థితులకు దారితీయవచ్చని, ఆ పరిస్థితిరాకుండా భారత్ జాగ్రత్త పడాలని హెచ్చరించారు. కాశ్మీరులో యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించారు. 
 
అంతకుముందు ఆయన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేస్తూ, భారత్ నిర్ణయాన్ని ఏ ఒక్క కాశ్మీరీ సహించలేరన్నారు. ఈ పరిస్థితుల్లో పుల్వామా దాడులు పునరావృతమయ్యే అవకాశం ఉందన్నారు. అపుడు భారత్ మమ్మల్నే నిందిస్తుంది. మాపై దాడికి దిగుతుంది. మేం ప్రతిదాడికి దిగుతాం. ఆ ర్వాత ఏం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరూ గెలవరు. ఇది అణ్వస్త్ర బెదిరింపు మాత్రం కాదంటూ వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో లఢఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడాన్ని తాము అంగీకరించబోమని, ఈ చర్య సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని చైనా వ్యాఖ్యానించగా, భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ విభజన పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము కల్పించుకోబోమని, ఇతర దేశాల నుంచి కూడా అదే కోరుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.