శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 ఫిబ్రవరి 2025 (14:42 IST)

దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)

Thief has heart attack
ప్రయాణికుల వద్ద నగదును, విలువైన వస్తువులను దోచుకెళ్లేందుకు దొంగలముఠా కారులో దిగింది. కారు దిగడంతోనే ప్రయాణికులపై విరుచుకుపడ్డారు. తుపాకీ చూపించి బెదిరిస్తూ వారి బ్యాగులను లాక్కున్నారు.
 
ఐతే అకస్మాత్తుగా దొంగలముఠాలోని ఓ దొంగకి గుండెపోటు వచ్చింది. దాంతో అతడు కారు డోర్ తీసుకుని ఎక్కేద్దామనుకున్నాడు కానీ అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన మరో దొంగ కిందపడ్డ దొంగను పట్టుకుని కారులో వేసుకుని కుక్కను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.