శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (10:32 IST)

చైనాకు షాకిచ్చిన అమెరికా.. టిక్‌టాక్, వీచాట్‌లపై నిషేధం

అగ్రరాజ్యం అమెరికా చైనాకు షాకిచ్చింది. కరోనా మహమ్మారి తమ దేశంతో పాటు ప్రపంచం మొత్తాన్నీ కుదిపేయడానికి కారణం చైనాయేనని ముందు నుంచి చెప్పుకొస్తున్న అమెరికా.. మరోసారి డ్రాగన్‌ కంట్రీకి షాకిచ్చింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నామని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం వెల్లడించింది.
 
అమెరికా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా పది కోట్ల మంది సమాచారాన్ని టిక్‌టాక్‌, వీచాట్‌ యాక్సిస్‌ చేస్తుండటంతో భద్రతారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ కారణంగానే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్‌టాక్‌, వీచాట్‌లను నిషేధించామని అమెరికా తెలిపింది. మిగతా ఆంక్షల్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. కాగా, టిక్‌టాక్‌కు సంబంధించిన అమెరికా వ్యాపారాన్ని తమ దేశ సంస్థలకే అప్పగించాలని.. లేదంటే బ్యాన్‌ చేస్తామని ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆ పని చేశారు.