శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:52 IST)

19-09-2020 శనివారం దినఫలాలు - వేంకటేశ్వర స్వామిని పూజిస్తే...(video)

మేషం : ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మిమ్మలను తప్పుదారిపట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌కు మరికొంత సమయం పడుతుంది. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. 
 
వృషభం : స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తుల నుంచి ఊహించని చికాకులు ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. మీ సంతానం ఆహార, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం కూడదు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మిథునం : నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావడం మంచిది. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఖర్చులు మీ స్తోమతకు తగినట్టుగానే ఉంటాయి. 
 
కర్కాటకం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పత్రికా, వార్తా సంస్థలలో మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల పనిభారం వంటి చికాకులు తప్పవు. రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
సింహం : ఇసుక, క్వారీ, బిల్డింగ్, కాంట్రాక్టర్లకు సమస్యలు తలెత్తుతాయి. ప్రైవేటు సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చికాకు పరుస్తాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. 
 
కన్య : స్త్రీలకు రచన, కళారంగాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఒకరికి మేలు చేయబోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. కష్టసమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తులు దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. 
 
తుల : వృత్తిపరంగా ఎదురైనా అటంకాలను అధికమిస్తారు. మీ శ్రీమతికి ప్రతి విషయాన్ని అనునయంగా చెప్పటం క్షేమదాయకం. వైద్యులకు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకునేదిశగా యత్నాలు సాగిస్తారు. వాహనం నిదానంగా నడపడం మంచిది. ఆత్మీయుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. 
 
వృశ్చికం : రావలసిన ధనంలో కొంతమొత్తం చేతికందుతుంది. మీ సంతానం పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఒప్పందాలు, హామీల విషయంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
ధనస్సు : మీ సంతానం కదలికలపై దృష్టిసారించండి. స్త్రీలు, టీవీ, చానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. ఎంత జఠిలమైన సమస్యనైనా మనోనిబ్బరంతో ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. 
 
మకరం : ఆదాయ వ్యయాలు మీ స్తోమతకు తగినట్టుగానే ఉంటాయి. ప్రైవేటు రంగాల్లో వారి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. 
 
కుంభం : ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. మీ అంచనాలు పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. రుణం కొంత మొత్తమైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ సంతానంతో సరదాగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మీనం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకువేస్తారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ శ్రీమతి పట్ల ప్రేమ, ప్రత్యేకాదరణలు కనబరుస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లు రాణిస్తారు. మత్స్యు, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు.