శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-09-2020 మంగళవారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని పూజిస్తే....

మేషం : ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలలో క్షణం తీరికవుండదు. మీ శ్రీమతి సూటిపోటి మాటు అసహనం కలిగిస్తాయి. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. సోదరీసోదరుల మధ్య అభిప్రాయభేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. 
 
వృషభం : కుటుంబ సమేతంగా దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామిక రంగాల వారిక ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
మిథునం : అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఒంటరిగా ఏ పని చేయడం క్షేమం కాదని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. 
 
కర్కాటకం : అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో అవసరం. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. 
 
సింహం : రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. బంధువులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. వృత్తిపరమైన చికాకులను ఎదుర్కోకవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటరు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు ఏకాగ్రత అవసరం. 
 
కన్య : బంధువుల ఒత్తిడి, తాకిడి అధికంగా ఉంటుంది. కళ్లు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఇతరులకు పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం ఆలస్యంగా అందడంతో నిరుత్సాహం తప్పదు. 
 
కన్య : బంధువుల ఒత్తిడి, తాకిడి అధికంగా ఉంటాయి. కళ్లు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఇతరులకు పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదని గమనించండి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. విద్యార్థుకు టెక్నికల, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. 
 
వృశ్చికం : సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. స్థిరచరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. 
 
ధనస్సు : పెద్దలు మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గత తప్పిదాలు పునరావృతంకానున్నాయి. మీ ఏమరుపాటువల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధికమిస్తారు. 
 
మకరం : బ్యాంకు వ్యవహారాలలో హామీలు ఉండటం మంచిదికాదని గమనించండి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అధిక శ్రమ తప్పదు. ఏ విషయానికి కలిసిరాని మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని పనులు సాధించాలంటే పట్టు విడుపు ధోరణితో మెలగవలసి ఉంటుంది. 
 
కుంభం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. సందర్భానుకూలంగా సంభాషించడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం అందడంతో ఎంతో కొంత పొదుపు చేయగలగుతారు. 
 
మీనం : వ్యాపారాల అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. పాత బిల్లులు చెల్లిస్తారు. స్త్రీల అనాలోచిత వ్యాఖ్యలు, చర్యలు సమస్యకు దారితీస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సంతానం మొండి వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది.