శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-09-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్యుడిని ఎర్రని పువ్వులతో...?

ఆదిత్యుడిని ఎర్రని పువ్వులతో ఆరాధించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం: నూనె మిర్చి, కంది, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగులకు అధిక శ్రమ చికాకు పడినప్పటికీ సంతృప్తి పొందుతారు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. స్నేహ బృందాలు అధికమవుతాయి.
 
వృషభం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. ఖర్చులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. 
 
మిథునం: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. దూర ప్రయాణాలు, ద్రవ్య చెల్లింపుల్లో మెలకువ వహించండి. 
 
కర్కాటకం: సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. మీ మాటకు మంచి గుర్తింపు రాణించి లభిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీ విలువైన వస్తువులు, పత్రాలకు సంబంధించిన విషయాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
సింహం: మానసిక ప్రశాంతతకు పుస్తక పఠనం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించండి. గృహోపకరణ వ్యాపారులకు సామాన్యం. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలసిరాగలదు. ప్రయాణాలు పెద్దలతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి.
 
కన్య: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. 
 
తుల: ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. గోప్యంగా యత్నాలు సాగించండి. కాంట్రాక్టర్లకు నూతన పనులు చేపట్టే విషయంలో పునరాలోచన అవసరం. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు.
 
వృశ్చికం: స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు వాయిదా పడటం లేక జాప్యం వంటి చికాకులు తప్పవు. 
 
ధనస్సు: ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆత్మీయులకు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
మకరం: ట్రాన్స్‌పోర్ట్, ఆటో మొబైల్, మెకానికల్ రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. బంధువులు మీ నుంచి ఆర్థిక సాయం అర్థిస్తారు. వ్యాపకాలు మాని కుటుంబ విషయాలపై శ్రద్ద వహించండి. మీ సేవలకు ప్రశంసలు అందుకుంటారు. రుణభారం తొలగి మానసికంగా కుదుటపడతారు. 
 
కుంభం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. నూతన వస్తువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణాల్లో అపరిచితుల పట్ల మెలకువ వహించండి. రిప్రజెంటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. 
 
మీనం: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ రంగాల్లో వారి అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో మానసికంగా కుదుటపడతారు.