14-09-2020 సోమవారం మీ రాశిఫలితాలు.. రోజులు భారంగా గడుస్తున్నట్లు? (video)

Last Modified: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:54 IST)

mesh raashi
mesh raashi

శంకరుడిని పూజించినట్లైతే మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
మేషం: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, వ్యాపారులకు లాభదాయకం. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులు లాభిస్తాయి. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు కానవస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. హామీలకు దూరంగా ఉండటం మంచిది. 
 
వృషభం: ఆర్థికంగా బాగుగా పురోభివృద్ధి పొందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ చాలా అవసరం. కుటుంబీకులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు పెరగడంత అదనపు రాబడి పట్ల దృష్టి సారిస్తారు. ప్రముఖులను కలుసుకునేందుకు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. 
 
మిథునం: వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు, నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తాయి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. కొత్త వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి తగవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సభ్యత్వాలు, పదవులు, బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. రోజులు భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. 
 
సింహం: విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉద్యోగం మాని వ్యాపారాలు చేయడం మంచిది కాదని గమనించండి. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం సంతృప్తినిస్తుంది. మీ అభిప్రాయాలను మీ శ్రీమతికి సున్నితంగా వ్యక్తం చేయండి. ధనవ్యయంలో మితం పాటించండి.
 
కన్య: ఆరోగ్యం, యోగా విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. లౌక్యంగా పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టులు, వ్యాపారాల విస్తరణలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
 
తుల: వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు సంభవం. విద్యార్థులు ఆందోళనలు, అల్లర్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. బకాయిలు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు చికాకులు అధికం. బంధుమిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగవకాశం లభిస్తుంది. దూర ప్రయాణాలు ఆకస్మింగా వాయిదా పడతాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
ధనస్సు: అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగస్సమర్థతకు గుర్తింపు, పదోన్నతి వంటి శుభపరిణామాలున్నాయి. అప్రయత్నంగా కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
 
మకరం: బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. 
 
కుంభం: స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయులు బహుమతులు అందుకుంటారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. రావలసిన ధనం అందకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం: ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు వాయిదా పడతాయి. విద్యుత్, రవాణా రంగాల్లోని వారికి చికాకులు అధికం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన ధనం అందటం వల్ల పాత బాకీలు తీరుస్తారు. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :