17-09-2020 గురువారం దినఫలాలు - గురు పారాయణం చేస్తే సంకల్పసిద్ధి

astro7

మేషం : గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమల వారికి ప్రోత్సాహకరం. చిరు వ్యాపారులకు చికాకులు తప్పవు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
వృషభం : ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తప్పవు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. ఎదుటివంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. దుబారా ఖర్చులు అధికం. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. 
 
మిథునం : ఉద్యోగస్సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. మీ సహాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉమ్మడి వెంచర్లు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. 
 
కర్కాటకం : పుణ్యక్షేత్ర సందర్శనలు వంటి శుభఫలితాలుంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగస్తులకు రావలసిన క్లయింలు, అలవెన్సులు ఆలస్యంగా అందుతాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. కొంత మంది మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. 
 
: హోల్‌సేల్, వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ మాటకు గృహంలో అందరూ కట్టుబడి వుంటారు. ఆస్తి పంపకాలు, భూ వివాదాలు పరిష్కారం కావు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
తుల : ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య ఒప్పందాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. విద్యార్థులకు క్రీడ, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు స్త్రీలకు అయినవారి నుంచి ఆదరణ లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహరుస్తాయి. 
 
వృశ్చికం : కుటుంబంలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఎంతో కొంత పొదువు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్త్రీల మనోవాంఛలు, అవసరాలు నెరవేరుతాయి. మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులు, చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. 
 
ధనస్సు : తలపెట్టిన పనులు అనుకున్నంత తేలికగా పూర్తికావు. ప్రతి విషయానికి మీలో అసహనం చికాకులు చోటుచేసుకుంటాయి. ఖర్చులు రాబడికి తగినట్టే ఉంటాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. విద్యార్థులు తోటివారివల్ల చికాకులు తప్పవు.
 
మకరం : వృత్తుల వారికి శ్రమ అధికం. ఆదాయం స్వల్పంగా ఉంటుంది. విందులలో పరిమితి పాటించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయల్లో పునరాలోచన మంచిది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
కుంభం : వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆపత్సమయంలో సన్నిహితులు గుర్తుకొస్తారు. ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ అంచనాలు, ఊహలు నిజమవుతాయి. సమయానికి చేతిలో ధనం లేక బాగా అవస్థపడతారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. 
 
మీనం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుంత చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పెద్దల సలహాను పాటించి మౌ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి తోటివారి వల్ల చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు లీవు, అడ్వాన్సులు మంజూరవుతాయి. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :