మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (12:23 IST)

16-09-2020 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించినా అన్ని విధాలా శుభం (video)

మేషం : వైద్, ఇంజనీరింగ్, శాస్త్ర వాణిజ్య రంగాల్లో వారికి ఆశించినంత ఫలితం ఉండదు. వ్యవసాయ తోటల రంగాల వారికి వాతావరణంలోని మార్పులు చికాకు, ఆందోళన కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు సంతృప్తినిస్తుంది. చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు.
 
వృషభం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహా పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు త్వరలోనే మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : మీ సంతానం ఆరోగ్య, విద్యా విషయాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. స్త్రీలు విలాస వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ధనవ్యయం, చెల్లింపుల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కార్యసాధనలో శారీరక శ్రమ, ప్రయాసలెదుర్కొంటారు. సమయానికి సహకరించని బంధువుల వల్ల ఒకింత అసహనానికి గురవుతారు. 
 
కర్కాటకం : కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసివస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. నూతన దంపతులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
సింహం : వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కోర్టు పనులు వాయిదాపడటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థిక పరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. 
 
కన్య : ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. భాగస్వామికులకు మీరంటే విశ్వాసం ఏర్పడుతుంది. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. 
 
తుల : విదేశీయాన రుణ యత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం తలపెడతారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి. 
 
వృశ్చికం : వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన. కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధాన. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. ఏజెట్లు, బ్రోకర్లకు నిరుత్సాహం తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అభ్యంతరాలెదురవుతాయి. 
 
మకరం : వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. కొంతమంది మిమ్మలను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. దూరప్రాంతం నుంచి వచ్చిన ఒక లేక మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణంలోని మార్పు రైతులలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసిక సంతృప్తి పొందుతారు. 
 
కుంభం : హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరిగినా ఆర్థికంగా తట్టుకోగలుగుతారు. అయినవారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమే. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్తలు వింటారు. 
 
మీనం : స్త్రీలకు ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహా అవసరం అవుతుంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తినా నెమ్మదిగా తెలివితో పరిష్కరిస్తారు. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు.