సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (12:35 IST)

2020 ఎన్నికల్లోనూ నేనే అధ్యక్షుడిగా ఎన్నికవుతా: డొనాల్డ్ ట్రంప్

2020 ఎన్నికల్లోనూ తానే అధ్యక్షుడిగా ఎన్నికవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలపై తనకు అంచంచల విశ్వాసం వుందన్నారు. డెమొక్రటిక్ పార్టీలో తనను ఢీకొట్టగలిగే

2020 ఎన్నికల్లోనూ తానే అధ్యక్షుడిగా ఎన్నికవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలపై తనకు అంచంచల విశ్వాసం వుందన్నారు. డెమొక్రటిక్ పార్టీలో తనను ఢీకొట్టగలిగే వ్యక్తే లేరని తేల్చి చెప్పారు. తనకు వారందరూ తెలుసునని.. కానీ తనను ఢీకొట్టగలిగి వ్యక్తి కనిపించట్లేదని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలపై స్వదేశంతోపాటు విదేశాల్లోనూ నిరసన వెల్లువెత్తుతున్న వేళ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
మరోవైపు ట్రంప్ లండన్ పర్యటనపైనా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ఇంటర్వ్యూలో రిపబ్లిక్ పార్టీ చరిత్రలోనే తాను అత్యంత పాప్యులర్ వ్యక్తినని చెప్పుకున్నారు. అంతేకాదు, ఈ విషయంలో అబ్రహం లింకన్‌ను కూడా అధిగమించానని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ జరిపిన సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్‌ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. 
 
33 శాతంతో రెండో స్థానంలో బిల్‌ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్‌ రీగన్‌ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్‌ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు.